కర్కశ తండ్రి: ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు
08:49 October 01
ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే... ఆ కూతురి పాలిట యముడయ్యాడు. ఆడపిల్లగా పుట్టడమే ఆ పసికందు తప్పైంది.
అసలేం జరిగిందంటే...?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంటలో దారుణం చోటు చేసుకుంది. రెండో సంతానంలోనూ ఆడపిల్లే పుట్టిందని ఓ తండ్రి దుర్మార్గానికి ఒడికట్టాడు. నెలరోజుల పసికందును నీటితొట్టిలో పడేసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు.
TAGGED:
father killed daughter