తెలంగాణ

telangana

By

Published : Nov 19, 2020, 4:24 PM IST

ETV Bharat / state

సర్పంచ్ సాక్షిగా ఉపాధి హామీ పనుల్లో చిన్నారులు

సర్పంచ్ సాక్షిగా ఉపాధి హామీ పనుల్లో చిన్నారుల చేత పనిచేయించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రోల్లపాడులో చోటుచేసుకుంది. పెద్దవారితో కాకుండా పిల్లలతో పనిచేయించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

సర్పంచ్ సాక్షిగా ఉపాధి హామీ పనుల్లో చిన్నారులు
సర్పంచ్ సాక్షిగా ఉపాధి హామీ పనుల్లో చిన్నారులు

సర్పంచ్ సాక్షిగా ఉపాధి హామీ పనుల్లో చిన్నారులు

పలక బలపం పట్టాల్సిన చిన్నారుల చేతులు నర్సరీల్లో మట్టి పనులు చేస్తూ వాడిపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోల్లపాడు పంచాయతీలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు నియమించిన పనివాళ్లలో ఎక్కువ సంఖ్యలో చిన్నారులే ఉన్నారు. బడికి వెళ్లాల్సిన పిల్లల చేత ఉపాధి హామీ పనులు చేయిస్తున్నారు.

పరిస్థితిని గమనించిన అక్కడి అంగన్వాడీ ఉపాధ్యాయురాలు... సర్పంచ్, ఉపసర్పంచ్​లను నిలదీశారు. వారు తమ పనిని సమర్థించుకుంటూ... ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనను ఓ యువకుడు చరవాణీలో చిత్రీకరించారు. ఉపాధి హామీ పనులలో చిన్నారులతో పనిచేయించడమేంటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి:'ఎంఐఎంతో పొత్తు లేదు... తెరాసదే మేయర్ పీఠం'

ABOUT THE AUTHOR

...view details