తెలంగాణ

telangana

By

Published : Aug 25, 2019, 9:55 PM IST

ETV Bharat / state

రామయ్య సన్నిధిలో ఉట్టి వేడుకలు

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఉట్టి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. భక్తజన సందోహం నడుమ సాగిన ఉట్టి వేడుకలు అందరిలో ఆనందాన్ని నింపాయి.

రామయ్య సన్నిధిలో ఉట్టి వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రెండు రోజుల పాటు శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు రామయ్య సన్నిధిలో వుట్ల పండుగ వేడుక వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముని మంగళ వాయిద్యాల నడుమ చిత్ర కూట మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం వుట్టి కొట్టే వేడుకను ఘనంగా నిర్వహించారు. భక్తజన సందోహం నడుమ ఉట్టి కొట్టే వేదిక ఆధ్యాత్మికంగా సాగింది.

రామయ్య సన్నిధిలో ఉట్టి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details