ఆర్టీసీలో కార్మిక సంఘాలకు బదులు వెల్ఫేర్ సొసైటీల అమలు కోసం అధికారులు సంతకాలు సేకరిస్తున్నారంటూ కార్మిక సంఘాల నేతలు నిరసన తెలిపారు. ఆదిలాబాద్ డిపో వద్ద ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదిస్తూ ధర్నా చేశారు. కార్మిక సంఘాలు లేకుండా చూడాలనే ప్రభుత్వ నిర్ణయం మంచిది కాదనీ... ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో సంఘాలు ఉండాల్సిందే: కార్మిక సంఘాల నేతలు - ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉంచాలని ఆర్టీసీ కార్మికుల నిరసన
ఆర్టీసీలో వెల్ఫేర్ సోసైటీల అమలు కోసం... అధికారులు సంతకాలు సేకరణ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆర్టీసీ ఐకాస ఆందోళన బాట పట్టింది. ఆదిలాబాద్‌లోని డిపో ప్రధాన ద్వారా ఎదుట ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ధర్నా చేశారు.

'ఆర్టీసీలో సంఘాలు ఉండాల్సిందే'