తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణం తీసిన స్థిరాస్తి వ్యాపారం - REAL ESTATE MURDER in ADILABAD DISTRICT

ఆదిలాబాద్ పట్టణంలో రియాల్టర్ దారుణ హత్య కలకలం రేపింది. భూ వ్యవహారాల్లో తాటిగూడకు చెందిన అన్నదమ్ములు దిలీప్, గోపాల్.. తమ యజమాని అమూల్ కుమార్​ను అందరూ చూస్తుంగానే కత్తితో దారుణంగా హత్య చేశారు.

REAL ESTATE MURDER in ADILABAD DISTRICT
ప్రాణం తీసిన స్థిరాస్తి వ్యాపారం

By

Published : Dec 17, 2019, 12:39 PM IST

ఆదిలాబాద్ పట్టణం బస్టాండ్ సమీపంలోని నడి రోడ్డుపై రియల్టర్ దారుణ హత్య కలకలం రేపింది. ఈ ఘటనలో బేల మండల కేంద్రానికి చెందిన అమూల్ కుమార్ మృతి చెందారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆదిలాబాద్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

గతంలో ఆయన దగ్గర పనిచేసిన అన్నదమ్ములైన దిలీప్‌సింగ్ షేకావత్‌, గోపాల్ సింగ్‌ షేకావత్‌ హత్యచేసినట్లు ఆయన వెల్లడించారు. అక్రమంగా ప్లాట్లు విక్రయించిన విషయంలో అమూల్‌ కుమార్‌ రూ. 35లక్షలు చెల్లించకుండా అన్నదమ్ములను ముప్పుతిప్పలుపెట్టాడని పేర్కొన్నారు. పైగా ఆ ప్లాట్లు కొనుగోలుచేసిన బాధితులు నిందితులపై ఒత్తిడితేగా.. అమూల్‌కుమార్​కు సంబంధం లేదన్నట్లు చేతులెత్తేయటం వల్ల హత్యకు దారితీసినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులతో పాటు వారు ఉపయోగించిన రెండుకత్తులను స్వాధీనంచేసుకున్నట్లు తెలిపారు.

ప్రాణం తీసిన స్థిరాస్తి వ్యాపారం

ఇవీచూడండి: చిల్లర రాజకీయాలతో పార్టీకి చెడ్డపేరు తేవొద్దు: తుమ్మల

ABOUT THE AUTHOR

...view details