విద్యార్థుల పుస్తకాల కొనుగోలుకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ రూ. లక్ష అందించారు. గిరిజన విద్యార్థులందరూ విద్యావంతులు కావాలని రేఖానాయక్ ఆకాంక్షించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లాల్టెకిడిలోని పాలిటెక్నిక్ విద్యార్థులు కనీస వసతులు లేవని రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే రేఖానాయక్ విద్యార్థుల పుస్తకాలకయ్యే ఖర్చు కోసం తాను రూ. లక్ష ఇస్తామని మాట ఇచ్చారు. పాలిటెక్నిక్ కళాశాల చేరుకొని ప్రిన్సిపల్‌కు నగదును అందజేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యల పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కళాశాల సిబ్బంది, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.
మాట నిలబెట్టుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే
ఇచ్చిన మాటకు కట్టుబడి విద్యార్థుల ప్రశంసలు అందుకున్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్. గిరిజన విద్యార్థుల పుస్తకాల కోసం రూ. లక్ష ఇస్తానని అందజేశారు.
మాట నిలబెట్టుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే