Dialysis patient: సొంతిళ్లులేని ధైన్యం. రెక్కాడితేకానీ డొక్కనిండని పేదరికం. అయినా కుంగిపోని మనస్థత్వం. ఉన్నదాంట్లోనే ఆనందంగా గడిపిన దాంపత్యం. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. క్షణం ఒక యుగంలా కాలం వెల్లదీయాల్సి వస్తోంది. వెరసి... ఏడాదిన్నరలోనే తారుమారైన ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌కు చెందిన నవదంపుతులైన సంకినేని దీపాలి-నితిన్ బతుకుచిత్రమిది.
మూడేళ్ల క్రితం పెళ్లైన దీపాలి- నితిన్‌ది నిరుపేద కుటుంబం. బతుకుదెరువులో భాగంగా మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌కు వలసవచ్చిన వీరికి ఆస్తిపాస్తులేమీలేవు. సొంతిల్లూలేదు. జైనథ్‌లో ఖాళీగా పడి ఉన్న రెండుపడక గదుల ఇంటిలోనే తాత్కాలిక నివాసమైనప్పటికీ బెంగపడలేదు. ఏడాదిన్నర క్రితం దీపాలి గర్భం దాల్చగా... ఆనందంగా వైద్యం కోసం వెళ్లగా హైబీపీ ఉన్నట్లు తేలింది. వైద్యపరీక్షలు చేయిస్తే మూత్రపిండాల సమస్య ఉన్నట్లు నిర్ధారణ కావడంతో దీపాలి-నితిన్‌లో ఆందోళన మొదలైంది. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా రెండు మూత్రపిండాలు పాడైపోయినట్లు తేలడంతో బతుకును చీకటి ఆవరించినట్లైంది. ఈలోగా గర్భస్రావం జరిగింది. దీపాలి బతకాలంటే మూత్రపిండం మార్పిడి తప్పనిసరని, 9 లక్షలు ఖర్చవుతాయనీ, అప్పటివరకు వారంలో మూడుసార్లు డయాలసిస్ చేయాల్సిందేనని వైద్యులు సూచించడంతో ఏం చేయాలో తెలియక అల్లాడుతోంది.