తెలంగాణ

telangana

ETV Bharat / state

108 శివలింగాలు - శివరాత్రి చిత్ర ప్రదర్శన

శివరాత్రి సందర్భంగా ఆదిలాబాద్​లో బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన ఆకట్టుకుంటోంది. 108 శివలింగాల ఆకృతులు భక్తులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.

శివరాత్రి

By

Published : Mar 4, 2019, 4:01 PM IST

శివరాత్రి సందర్భంగా చిత్ర ప్రదర్శన
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్​ పట్టణంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 108 రకాల శివలింగాల ఏర్పాటు భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. ప్రజల్లో సామాజిక రుగ్మతలు రూపుమాపి.. ఆధ్యాత్మికతను పెంపొందించడానికి పలు చిత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. చెడు వ్యసనాలు వదులుకొని.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతతో జీవనం సాగించేలా చూడటానికే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు బ్రహ్మకుమారీ సంస్థ​ ప్రతినిధులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details