తెలంగాణ

telangana

ETV Bharat / state

కళ్లు లేకున్నా.. కరెంటు బిల్లు చేరకున్నా..! - blind man paid power bill in mamada

లాక్​డౌన్​ వల్ల గత ఏడాది మార్చిలో వచ్చిన విద్యుత్​ బిల్లునే ఇప్పుడు కట్టమని అధికారులు ప్రజలను కోరారు. పుట్టుకతో కళ్లు కనిపించని ఓ వ్యక్తి ఇటువంటి ఆపత్కర పరిస్థితుల్లోనూ కరెంట్​ ఆఫీసును వెతుక్కుంటూ వెళ్లి విద్యుత్​ బిల్లును చెల్లించాడు. సమాజం పట్ల అతనికున్న బాధ్యతను విద్యుత్​ అధికారులు ప్రశంసించారు.

blind man paid power bill in mamada
కళ్లు లేకున్నా... కరెంట్ బిల్లు కట్టాడు

By

Published : Apr 19, 2020, 12:24 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా గతనెల విద్యుత్తు వినియోగపు రీడింగ్‌ను సంస్థ తీసుకోలేదు. అందుకే బిల్లు కాగితం వినియోగదారుల ఇళ్లకు చేరలేదు. గత సంవత్సరం మార్చిలో వచ్చిన బిల్లునే ఇప్పుడూ కట్టమంటున్నారు. బయటకు రావడం ఇబ్బందిగా ఉంటే ఆన్‌లైన్‌లో చెల్లించాలంటూ విద్యుత్తు పంపిణీ సంస్థలు కోరుతున్నాయి.

ఇందుకు ఎవరు స్పందిస్తున్నారో లేదో కానీ.. పుట్టుక నుంచి రెండు కళ్లూ కనిపించని ఆదిలాబాద్​ జిల్లా మామడకు చెందిన లక్ష్మణ్‌ అనే వ్యక్తి ఎప్పటిలాగే కర్రపట్టుకొని శనివారం ఉదయం కరెంటు ఆఫీసును వెతుక్కుంటూ జాగ్రత్తగా వెళ్లాడు. అందరిలాగే వరసలో నిల్చొని తన ఇంటి విద్యుత్​ బిల్లు రూ.100 చెల్లించాడు.

కష్టపడి ఇంత దూరం ఎందుకొచ్చావని అక్కడున్న వ్యక్తులు అడగగా.. ప్రతి నెలా బిల్లు కడుతాను, ఆలస్యమైతే జరిమానా పడుతుంది కదా అంటూ సమాధానమిచ్చాడు లక్ష్మణ్‌.

ABOUT THE AUTHOR

...view details