తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2020, 7:05 AM IST

ETV Bharat / sports

అర్జెంటీనా యువ కెరటం పొదరోస్కా సంచలనం

ఫ్రెంచ్​ ఓపెన్​లో అర్జెంటీనా క్రీడాకారిణి నదియా పొదరోస్కా అద్భుత ప్రదర్శన కనబరిచింది. మూడో సీడ్​ స్వితోలినా(ఉక్రెయిన్​)ను ఓడించి.. మహిళల సింగిల్స్​ సెమీఫైనల్​కు చేరిన తొలి క్వాలిఫయర్​గా ఘనత సాధించింది.

Nadia Podoroska
పొదరోస్కా

అర్జెంటీనా యువ కెరటం నదియా పొదరోస్కా చరిత్ర సృష్టించింది. ఓపెన్‌ శకంలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌కు చేరిన తొలి క్వాలిఫయర్‌గా ఘనత సాధించింది. మూడో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) పోరాటానికి ఆమె తెరదించింది. ప్రపంచ 131వ ర్యాంకర్‌ అయిన పొదరోస్కా మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో 6-2, 6-4తో స్వితోలినాకు షాకిచ్చింది.

కెరీర్‌లో కేవలం రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆడుతున్న పొదరోస్కా (అర్జెంటీనా) ఐదో ర్యాంకు స్వితోలినాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 13 బ్రేక్‌ అవకాశాలు సృష్టించుకున్న ఆమె.. ఎనిమిది సార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేసింది.

మరోవైపు అన్‌సీడెడ్‌ కొలిన్స్‌ (అమెరికా) క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-4, 4-6, 6-4తో జబెర్‌ (ట్యునీసియా)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో పాబ్లో బుస్టా (స్పెయిన్‌) క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. నాలుగో రౌండ్లో అతడు 6-2, 7-5, 6-2తో ఆల్ట్‌మైర్‌ (జర్మనీ)ను ఓడించాడు.

ABOUT THE AUTHOR

...view details