తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్‌లో ముగిసిన భారత్​ పోరాటం

ఆస్ట్రేలియన్​ ఓపెన్‌ మిక్స్​డ్​ డబుల్స్‌లో భారత క్రీడాకారుడు రోహన్‌ బోపన్న జోడీ ఓటమి పాలైంది. తాజాగా జరిగిన క్వార్టర్స్​ మ్యాచ్​లో ఐదో సీడ్​ నికోలా మెక్​టిక్​, బార్బోరా క్రిజికోవా ద్వయం చేతిలో వరుస సెట్లలో పరాజయం చెందిందీ బోపన్న ద్వయం.

Australian Open 2020
ఆస్ట్రేలియన్​ ఓపెన్‌: భారత ఆశలు ఆవిరి.. క్వార్టర్స్​లో బోపన్న ఓటమి

By

Published : Jan 30, 2020, 8:17 PM IST

Updated : Feb 28, 2020, 1:57 PM IST

ప్రముఖ గ్రాండ్​స్లామ్​ టోర్నీ ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భారత పోరాటం ముగిసింది. మిక్స్​డ్​ డబుల్స్​లో ఇవాళ జరిగిన క్వార్టర్స్​లో రోహన్​ బోపన్న ద్వయం ఓడిపోయింది. ప్రత్యర్థి జట్టు ఐదో సీడ్​ నికోలా మెక్​టిక్​-బార్బోరా క్రిజికోవా జంట చేతిలో 6-0, 6-2 తేడాతో పరాజయం చెందింది బోపన్న-నదియా జోడీ.

నదియా-బోపన్న జోడీ

మిక్స్​డ్‌ డబుల్స్​లో భారత క్రీడాకారిణి సానియా మీర్జాతో కలిసి బోపన్న బరిలోకి దిగాల్సింది. కానీ ఆమె కాలిపిక్క గాయం కారణంగా టోర్నీ ఆరంభంలోనే తప్పుకోగా.. నదియా కిచనోవ్​(ఉక్రెయిన్​)తో కలిసి బరిలోకి దిగాడు. క్వార్టర్స్​లో ఓడిపోవడం వల్ల ఈ ఏడాది తొలి గ్రాండ్​స్లామ్​ టోర్నీలో భారత్​కు నిరాశ ఎదురైంది.

బుధవారం జరిగిన మిక్స్​డ్​ డబుల్స్​ మ్యాచ్​లో భారత సీనియర్​ టెన్నిస్​ ఆటగాడు లియాండర్​ పేస్​ జోడీ రెండో రౌండ్​లోనే ఇంటిముఖం పట్టింది. ఇందులో జెలెనా ఒత్సపెంకో(లాత్వియా)తో కలిసి బరిలోకి దిగాడు పేస్​. ఈ మ్యాచ్​లో బెనాతీ- బ్రిటాన్​ జామీ ముర్రే చేతిలో 6-2, 7-5 తేడాతో ఓడిపోయింది పేస్​ ద్వయం.

Last Updated : Feb 28, 2020, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details