ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు భారత అథ్లెట్స్ సంసిద్ధమయ్యారు. ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మెగాక్రీడల్లో పాల్గొననున్న అథ్లెట్స్‌లో మొదటి బ్యాచ్‌ను జులై17న టోక్యోకు పంపించనున్నట్లు ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా వెల్లడించారు.
"మా ప్రణాళిక ప్రకారం తొలి బ్యాచ్ అథ్లెట్స్‌ను జులై 17న టోక్యోకు పంపించనున్నాం. వీలైతే క్వారంటైన్ నిబంధనలు , ట్రైనింగ్ దృష్ట్యా రెండు రోజుల ముందే వారిని పంపించడానికి ప్రయత్నిస్తాం. దీనిపై సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నాం. ఆటగాళ్లకు అన్ని విధాలా సహకరిస్తూ, బాగా ప్రోత్సాహిస్తున్నాం. త్వరలోనే పరిస్థితులన్నీ సద్దుమణుగుతాయని ఆశిస్తున్నాను"