ఆసియా పురుషుల అండర్-23 వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లో నేడు రసవత్తర పోరు జరగనుంది. మయన్మార్ వేదికగా జరుగుతోన్న టోర్నీలో తొలిసారి సెమీస్ చేరిన భారత జట్టు... పాక్‌తో తాడోపేడో తేల్చుకోనుంది.
శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్స్‌లో విజయం సాధించింది భారత్. మ్యాచ్‌లో తొలిసెట్ 16-25 తేడాతో కోల్పోయినా.. తర్వాత పుంజుకొని 25-19, 25-21 , 27-25 తేడాతో మిగతా మూడు సెట్లు కైవసం చేసుకుంది భారత ఫుట్‌బాల్ జట్టు.
ఆస్ట్రేలియాతో పోటీ పడుతున్న భారత ఆటగాళ్లు(తెలుపు దుస్తులు) అమిత్ గులియా సారథ్యంలో భారత జట్టు ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. లీగ్ దశలో బలమైన చైనా, న్యూజిలాండ్ జట్లను ఓడించింది భారత్.
" కుర్రాళ్లు సూపర్ ప్రదర్శన చేశారు. మొదటి రౌండ్లో మంచి ఆరంభం లభించకపోయినా తర్వాత సెట్ నుంచి బాగా ఆడారు. ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థిని ఓడించడం గొప్ప విజయం. ఈ గెలుపుతో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. నేడు పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాం. ఇప్పటికే నాకౌట్ దశ దాటిన మేము... మరింత రాణించాలని అనుకుంటున్నాం".
-- ప్రీతమ్ సింగ్, భారత అండర్-23 వాలీబాల్ కోచ్
మరో రెండు క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో చైనా జట్టుపై చైనీస్ తైపీ, శ్రీలంక జట్టుపై జపాన్ గెలిచి సెమీఫైనల్ చేరాయి.