భారత స్టార్ షట్లర్లు బోపన్న, సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఫైనల్ సమరంలో బ్రెజిల్ ప్లేయర్లు లూసా స్టెఫానీ, రఫాల్ మాటోస్‌తో తలపడ్డారు. వరుసగా రెండు సెట్లు కోల్పోయి ఓడిపోయారు. ఇక సానియా మీర్జా తన జీవితంలో చివరి గ్రాండ్ స్లామ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌కు బోపన్న భార్య, పిల్లలు కూడా వచ్చారు. సానియా కుటుంబం కూడా వచ్చింది. కాగా, మ్యాచ్ అనంతరం బోపన్న భార్యపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి బోపన్న కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చాడు.
బోపన్న భార్య ఫొటోను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. దానికి "బోపన్న భార్య.. నేను ఇప్పటివరకు చూడని అత్యంత అందమైన మహిళ " అని రాసుకొచ్చాడు. దీనిపై బోపన్న స్పందిస్తూ.." నేను ఏకీభవిస్తున్నాను.. " అని రిప్లై ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. లక్కీ మ్యాన్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరికొందరు ఇద్దరికీ కంగ్రాట్స్ తెలిపారు.
స్టార్ షట్లర్ భార్యపై నెటిజన్ కామెంట్.. ఎమోషనల్ అయిన సానియా మీర్జా!
ఇండియా స్టార్ షట్లర్ బోపన్న భార్యపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి అదే రీతిలో బోపన్న సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీ ఫైనల్స్‌లో బోపన్న, సానియా ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లోనే ఈ ఘటన జరిగింది.
ఎమోషనల్ అయిన సానియా మీర్జా..
రన్నరప్‌తో తన గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను ముగించింది సానియా మీర్జా. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ఒకవేళ నేను ఏడుస్తుంటే.. అవి ఆనందబాష్పాలు మాత్రమే. నేను ఇంకో రెండు టోర్నమెంట్లు ఆడతాను. నా ప్రొఫెషనల్ కెరీర్ మెల్‌బోర్న్‌లోనే మొదలైంది' అని భాగోద్వేగానికి గురైంది. 'నేను 14 ఏళ్ల వయసులో నేషనల్స్‌కు ఆడేటప్పుడు రోహన్ బోపన్న నా మొదటి పార్టనర్. ఇది 22 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పటికీ నాకు రోహన్ కంటే బెస్ట్ పార్టనర్ దొరకలేదు. అతడు నా బెస్ట్ ఫ్రెండ్.' అని బోపన్నకు సానియా కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించింది 36 ఏళ్ల సానియా మీర్జా. ఫిబ్రవరిలో జరిగే డబ్ల్యూటీఏ(వరల్డ్ టెన్నిస్ అసోషియేషన్) ఈవెంట్లో తన ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటివరకు ఈ షట్లర్.. మూడు మిక్స్డ్ డబుల్స్‌తో సహా 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించింది.