తెలంగాణ

telangana

ETV Bharat / sports

Arjuna Award: 'అర్జున' కోసం స్టార్​ బాక్సర్లు, స్విమ్మర్​

భారత స్టార్​ బాక్సర్లు గౌరవ్ సోలంకి, సోనియా, సిమ్రన్​జీత్​తో పాటు టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన స్విమ్మర్​ సాజన్​ ప్రకాశ్​.. అర్జున అవార్డుకు నామినేట్​ అయ్యారు. మెగాక్రీడలకు అర్హత సాధించిన తొలి స్విమ్మర్​గా సాజన్​ ఘనత సాధించాడు.

Arjuna Award
అర్జున అవార్డు

By

Published : Jul 3, 2021, 7:46 PM IST

మన దేశ స్టార్​ బాక్సర్​లు గౌరవ్​ సోలంకి, సోనియా, సిమ్రన్​జీత్​ కౌర్​ పేర్లను అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్​ఐ). 2018 ప్రపంచ ఛాంపియన్​షిప్​లో సిమ్రన్​జీత్​ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన నలుగురు మహిళా బాక్సర్లలో ఆమె కూడా ఒకరు.

సాజన్​ను మరోసారి..

సాజన్ ప్రకాశ్

ఒలింపిక్స్​కు నేరుగా అర్హత సాధించిన తొలి భారత స్విమ్మర్​ సాజన్​ ప్రకాశ్​ను అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది భారత స్విమ్మింగ్​ సమాఖ్య (ఎస్​ఎఫ్​ఐ). ప్రముఖ కోచ్​ కమ్లేశ్​ నానావటీని ధ్యాన్​చంద్​ పురస్కారానికి నామినేట్ చేసింది. పారాలింపిక్స్​లో ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్లను తీర్చిదిద్దిన తపన్​ పానీగ్రహీ పేరును ద్రోణాచార్య అవార్డుకు పంపింది ఎస్​ఎఫ్​ఐ.

టోక్యోలో తన రెండో ఒలింపిక్స్​లో పోటీపడనున్న ప్రకాశ్​ పేరును అర్జునకు సిఫార్సు చేయడం ఇది వరుసగా రెండో ఏడాది. రోమ్‌లో జరిగిన 200మీ. బటర్‌ఫ్లై విభాగంలో ఒక్క నిమిషం 56.38 సెకన్లలో రేసు ముగించి జాతీయ రికార్డు నెలకొల్పిన అతను.. అంతర్జాతీయ స్విమ్మింగ్‌ సమాఖ్య (ఫినా) 'ఏ' ప్రమాణాన్ని అందుకున్న తొలి భారత స్విమ్మర్‌గా ఘనత సాధించాడు.

ఇవీ చూడండి:

Tokyo Olympics: కష్టాలను ఎదురీది.. ఒలింపిక్స్ గమ్యాన్ని చేరి!

Amit Panghal: ప్రపంచ నెం.1 స్థానంతో ఒలింపిక్స్​కు

ABOUT THE AUTHOR

...view details