తెలంగాణ

telangana

ETV Bharat / sports

నైజీరియా మాజీ ఫుట్​బాల్​ కోచ్​పై జీవితకాల నిషేధం

మ్యాచ్​ ఫిక్సింగ్​కు పాల్పడిన నేరానికిగానూ నైజీరియా మాజీ ఫుట్​బాల్ కోచ్ శాంసన్ సియాసియాపై జీవితకాల నిషేధం విధించింది ఫిఫా. అతడిని దోషిగా తేల్చింది ఎథిక్స్​ కమిటీ.

ఫిఫా

By

Published : Aug 17, 2019, 11:07 AM IST

Updated : Sep 27, 2019, 6:41 AM IST

నైజీరియా మాజీ ఫుట్​బాల్ కోచ్​ శాంసన్​ సియాసియాపై జీవితకాలం నిషేధం విధించింది అంతర్జాతీయ ఫుట్​బాల్ సమాఖ్య(ఫిఫా). మ్యాచ్​ ఫిక్సింగ్​కు పాల్పడినట్లు రుజువైన కారణంగా అతడిపై వేటు వేసింది. ఫిఫా ఎథిక్స్ కమిటీ ముందు.. నేరం చేసినట్లు అంగీకరించాడుశాంసన్.

ఫిఫా

"శాంసన్ సియాసియా అవినీతికి పాల్పడినట్లు ఎథిక్స్ కమిటీ తేల్చింది. మ్యాచ్​ ఫిక్స్ంగ్ చేసేందుకు లంచం తీసుకున్నట్టు అతడు ఒప్పుకున్నాడు. ఫిఫా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా శాంసన్​పై జీవితకాల నిషేధం విధిస్తున్నాం" - ఫిఫా ప్రకటన.

నైజీరియా జాతీయ జట్టుకు 2010 - 2011 మధ్య కాలంలో కోచ్​గా బాధ్యతలు నిర్వర్తించాడు శాంసన్​. ఆ సమయంలో అతడు మ్యాచ్ ఫిక్సింగ్​కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. శాంసన్ అండర్-20, అండర్-23 జట్లకూ కోచ్​గా వ్యవహరించాడు.

ఇది చదవండి: టీమిండియా కోచ్: రవి భాయ్​కే మళ్లీ పట్టం

Last Updated : Sep 27, 2019, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details