తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Final 2023 : రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ డిక్లేర్డ్.. భారత్ టార్గెట్​ ఎంతంటే?

WTC Final 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 270/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో భారత్‌ విజయ లక్ష్యం 444 ఖరారైంది.

wtc final 2023 australia second innings declared
wtc final 2023 australia second innings declared

By

Published : Jun 10, 2023, 6:53 PM IST

Updated : Jun 10, 2023, 7:18 PM IST

WTC Final 2023 : భారత్‌తో తలపడుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్​లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 270/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో భారత్‌ విజయ లక్ష్యం 444గా ఖరారైంది. బ్యాటింగ్‌లో అలెక్స్‌ క్యారీ (66*) నాటౌట్‌గా నిలిచారు. మిచెల్‌ స్టార్క్‌ (41), కమిన్స్‌ (5) పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3వికెట్లు తీయగా.. మహమ్మద్‌ షమీ , ఉమేశ్‌ యాదవ్‌ తలో 2, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 469, టీమ్‌ఇండియా 296 పరుగులు చేసి ఆలౌటైంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు.

అనంతరం టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు కుప్పకూలింది. అజింక్యా రహానె (129 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 89), శార్దూల్ ఠాకూర్(109 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకోగా.. రవీంద్ర జడేజా(51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48) విలువైన పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీసాడు. నాథన్ లయన్ ఓ వికెట్ పడగొట్టాడు.

జడేజా అరుదైన ఘనత..
డబ్ల్యూటీసీ ఫైనల్​లో టీమ్​ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. మొదట బ్యాటింగ్‌లో 48 పరుగులు చేసిన జడేజా.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌.. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జడేజా టెస్టుల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా టీమ్ఇం డియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జడేజా రికార్డులకెక్కాడు.

గ్రీన్‌ను ఔట్‌ చేయడం ద్వారా జడేజా 268వ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బిషన్‌ సింగ్‌ బేడీ (266 వికెట్లు)ని క్రాస్‌ చేసి ఓవరాల్‌ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో రంగనా హెరాత్‌ (433 వికెట్లు), డేనియల్‌ వెటోరి (362 వికెట్లు), డ్రీక్‌ అండర్‌వుడ్‌ (298 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక టీమ్​ఇండియా తరపున లెఫ్టార్మ్‌ స్పిన్నర్లలో జడేజా (268 వికెట్లు), బిషన్‌ సింగ్‌ బేడీ (266 వికెట్లు) వినూ మన్కడ్‌ (161 వికెట్లు), రవి శాస్త్రి (151 వికెట్లు), దిలీప్‌ దోషి(114 వికెట్లు), ప్రగ్యాన్‌ ఓజా (113 వికెట్లు) వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమ్​ఇండియా బౌలర్ల జాబితాలో జడేజా ఏడో స్థానానికి చేరుకున్నాడు. జడేజా ప్రస్తుతం 65 టెస్టుల్లో 268 వికెట్లతో కొనసాగుతున్నాడు. జడ్డూ కంటే ముందు అనిల్‌ కుంబ్లే (619 వికెట్లతో) అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్‌ (474 వికెట్లు), కపిల్‌ దేవ్‌ (434 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. హర్బజన్‌ (417 వికెట్లు), ఇషాంత్‌ శర్మ, జహీర్‌ ఖాన్‌లు 311 వికెట్లతో నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.

Last Updated : Jun 10, 2023, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details