యూకే వేదికగా జరగనున్న 'ది హండ్రెడ్' ప్రారంభ లీగ్‌లో.. భారత మహిళ క్రికెట్ యువ సంచలనం షెఫాలీ వర్మ ఆడనుంది. ఇప్పటికే టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ.. ఈ టోర్నీలో ఆడటానికి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ)ను పొందారు. కివీస్ ఆల్‌రౌండర్ సోఫీ డేవిన్ నేతృత్వంలోని బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ జట్టు తరఫున బరిలోకి దిగనుంది.
'ది హండ్రెడ్' లీగ్‌లో మరో భారత క్రికెటర్!
యూకేలో జరగనున్న ది హండ్రెడ్ ప్రారంభ లీగ్‌లో మరో భారత మహిళా యువ క్రికెటర్ పాల్గొననుంది. యువ సంచలనం షెఫాలీ వర్మ.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడనుంది.
ఇప్పుడు షెఫాలీ కూడా ఈ జాబితాలో చేరింది. బీసీసీఐ నుంచి నిరభ్యంతర పత్రం పొందినట్లు క్రికెట్ వర్గాలు ధ్రువీకరించాయి. "షెఫాలీకి మాత్రమే కాదు.. మొత్తం భారత మహిళల క్రికెట్‌కే ఇది శుభవార్త. ప్రారంభ సీజన్ అయిన 'ది హండ్రెడ్' లీగ్‌లో ఐదుగురు భారతీయులు పాల్గొనడం గొప్ప విషయం. తన దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే విజయవంతమైన షెఫాలీకి.. ఈ టోర్నీ మరింత దోహదం చేస్తుంది." అని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.
గత మార్చిలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రాణించిన షెఫాలీ.. తన ఫుట్‌వర్క్ వెనక ఉన్న రహస్యాన్ని బయటపెట్టింది. సయ్యద్ ముస్తాక్ టోర్నీకి ముందు హరియాణా పురుషుల జట్టుతో కలిసి సాధన చేయడం కలిసొచ్చిందని తెలిపింది.
ఇదీ చూడండి:-రెజ్లర్ సుశీల్ కుమార్‌కు లుక్ఔట్ నోటీసులు జారీ