తెలంగాణ

telangana

ETV Bharat / sports

Steve smith test centuries : స్మిత్ సూపర్ సెంచరీ.. రోహిత్ రికార్డ్ బ్రేక్​ - రోహిత్ సెంచరీ రికార్డ్ బ్రేక్​ స్మిత్​

steve smith test centuries : యాషెస్‌ సిరీస్‌ మొదటి టెస్టు మ్యాచులో పేలవ ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌.. రెండో మ్యాచ్‌లో అదరగొట్టాడు. అద్భుత సెంచరీ సాధించి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

smith century record
స్మిత్ సెంచరీ రికార్డ్​

By

Published : Jun 29, 2023, 9:38 PM IST

steve smith test centuries : యాషెస్‌ సిరీస్‌ మొదటి టెస్టు మ్యాచులో పేలవ ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌.. రెండో మ్యాచ్‌లో అదరగొట్టాడు. తన బ్యాట్​కు పనిచెప్పాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో స్మిత్‌ వరుసగా 16, 6 పరుగులు మాత్రమే ఫెయిల్ అయ్యాడు. అయితే ఇప్పుడు తన రెండో మ్యాచ్‌లో మాత్రం అద్భుత సెంచరీతో మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. లార్డ్స్‌ మైదానంలో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో 110 పరుగులు చేశాడు. తద్వారా తన టెస్టు కెరీర్‌లో 32వ సెంచరీని నమోదు చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తంగా తన 44వ శతకాన్ని నమోదు చేశాడు.

రోహిత్‌ శర్మ రికార్డ్ బ్రేక్​..ఈ సెంచరీతో టీమ్​ఇండియా ప్రస్తుత కెప్టెన్​ రోహిత్‌ శర్మను(43) అధిగమించాడు స్టీవ్ స్మిత్​. ప్రస్తుతం క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక దీంతో పాటు మరో రికార్డును కూడా అతడు తన ఖాతాలో వేసుకున్నాడు.

తమ దేశం తరఫున..టెస్టుల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో ఆసీస్‌ తరఫున దిగ్గజ కెప్టెన్‌ స్టీవ్‌ వా 32 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అతడితో సంయుక్తంగా రెండో స్థానంలో పంచుకున్నాడు స్మిత్​. టెస్టుల్లో మొత్తంగా సచిన్‌ టెండుల్కర్‌(51), జాక్‌ కలీస్‌(45), రికీ పాంటింగ్‌(41) సెంచరీలు బాది టాప్​ లిస్ట్​లో కొనసాగుతున్నారు.

  • ప్రస్తుత తరం క్రికెటర్లలో అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సెంచరీలు సాధించిన టాప్‌-5 బ్యాటర్లు ఎవరంటే..
    విరాట్‌ కోహ్లీ(టీమ్​ఇండియా)- 75
    జో రూట్‌(ఇంగ్లాండ్​)- 46
    డేవిడ్‌ వార్నర్‌(ఆ‍స్ట్రేలియా)- 45
    స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా)- 44
    రోహిత్‌ శర్మ(భారత్‌)- 43.

416 పరుగులకు ఆలౌట్‌..ఇకపోతే.. ఈ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 416 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 66 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన లబుషేన్‌ 47 పరుగులు, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ట్రావిస్‌ హెడ్‌ 77 పరుగులతో బాగానే రాణించారు. ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలెక్స్‌ క్యారీ 22 పరుగులు, కెప్టెన్‌ కమిన్స్‌ 22 పరుగులు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో రాబిన్సన్‌, జోష్‌ టంగ్‌ చెరో మూడేసి వికెట్లు పడగొట్టగా.. రూట్‌ రెండు వికెట్లు తీశాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌, ఆండర్సన్‌కు ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇదీ చూడండి :

Steve Smith Record : యాషెస్​లో మరో రికార్డు.. ఆ ఫీట్​ను దాటేసిన స్టీవ్​ స్మిత్​!

ABOUT THE AUTHOR

...view details