Shreyas Iyer Test debut: టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ టెస్టు క్రికెట్ అరంగేట్రం ఖాయమైంది. న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టులో అతడిని జట్టులోకి తీసుకోనున్నట్లు తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానె ప్రకటించాడు. పలువురు కీలక ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు కల్పించాలని నిర్ణయించారు. తొడ కండరాల గాయం కారణంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడిండింది. రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే, జట్టు బ్యాటింగ్ విభాగంలో సమతూకం కోసం శ్రేయస్ అయ్యర్‌ను కూడా జట్టులోకి తీసుకుంటున్నట్లు అజింక్యా రహానె బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించాడు.
Ajinkya Rahane on KL rahul: గాయంతో కివీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది. ఈ సందర్భంగా రాహుల్ లేని లోటు ఎలా ఉంటుందనే దానిపై కెప్టెన్ అజింక్యా రహానె స్పందించాడు. కేఎల్ రాహుల్ లేకపోవడం దెబ్బేనని అయితే భారత ఓపెనింగ్ కాంబినేషన్ మీద ఆ ప్రభావం ఏమాత్రం పడబోదని రహానె స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో రాహుల్ అద్భుతంగా రాణించాడని, అయితే ఈ సిరీస్‌కు లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదని రహానె పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాకు మంచి యువ క్రికెటర్లు అందుబాటులో ఉన్నారని, వారిలో ఒకరు ఓపెనింగ్ స్థానాన్ని భర్తీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.