తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీని తలపించిన షెఫాలీ.. ఔటైన తీరుపై వివాదం

ఇంగ్లాండ్​తో జరిగిన రెండో వన్డేలో ఓటమిపాలైంది టీమ్ఇండియా. ఈ మ్యాచ్​లో యువ ఓపెనర్ షెఫాలీ వర్మ(Shafali Verma) 44 పరుగులతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే స్టంపింగ్​ నుంచి తప్పించుకునే క్రమంలో ధోనీ(ms dhoni)లా చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఆమె ఔటైన తీరుపై వివాదం నెలకొంది.

Shefali Verma
షెఫాలీ

By

Published : Jul 1, 2021, 12:45 PM IST

ఇంగ్లాండ్​ మహిళా జట్టుతో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది భారత మహిళా జట్టు. కెప్టెన్ మిథాలీ రాజ్​ 59 పరుగులతో అదరగొట్టగా, యువ విధ్వంసకర ఓపెనర్​ షెఫాలీ వర్మ(Shafali Verma) 44 పరుగులతో ఆకట్టుకుంది. అయితే ఈ మ్యాచ్​లో షెఫాలీ.. టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్(ms dhoni) ధోనీని తలపించింది.

ఏం జరిగింది?

ఈ మ్యాచ్​లో షెఫాలీ తన సహజసిద్ధమైన ఆటతీరుతో మెప్పించింది. స్మృతి మంధాన (22)తో కలిసి మొదటి వికెట్​కు 54 పరుగులు జోడించింది. ఈ క్రమంలోనే సోఫియా ఎక్లిస్టోన్ వేసిన 17వ ఓవర్లో భారీ షాట్​ ఆడేందుకు ముందుకు వచ్చింది. కానీ బంతి టర్న్ కావడం వల్ల అది కాస్తా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే వికెట్లను గిరాటేసింది జోన్స్. ఈ క్రమంలో షెఫాలీ తన కాళ్లను పూర్తిగా స్ట్రెస్ చేసింది. ఆస్ట్రేలియాపై ధోనీ కూడా ఓ మ్యాచ్​లో ఇలాగే చేశాడు. కానీ ధోనీ ఔట్​ నుంచి తప్పించుకోగా.. షెఫాలీ మాత్రం దొరికిపోయింది.

ఔట్​తో వివాదం

షెఫాలీ స్టంపౌట్​ వివాదానికి దారి తీసింది. కీపర్ బంతిని తీసుకుని వికెట్లను గిరాటేసిన సమయంలో షెఫాలీ కాలు క్రీజు లైన్​పై ఉంది. కానీ అంపైర్​ కాల్ ద్వారా దీనిని ఔట్​గా పరిగణించారు థర్డ్ అంపైర్. ఇలాంటి సంఘటనల్ని పునరావృతం చేయకూడదని, రనౌట్​ను కచ్చితంగా తెలుసుకునేందుకు పురుషుల క్రికెట్లో బెయిల్స్​ను ఎల్​ఈడీ రంగులతో తయారు చేస్తున్నారు. దీని ద్వారా బంతి బెయిల్​ తాకిన వెంటనే లైట్లు వెలుగుతాయి. దీంతో బ్యాట్స్​మెన్ రనౌట్​ను సమయోచితంగా నిర్ణయించవచ్చు. కానీ ఈ మ్యాచ్​లో ఎల్​ఈడీ బెయిల్స్ వాడకపోవడం ద్వారా బెయిల్స్, బంతిని ఎప్పుడు తాకిందో కచ్చితంగా తెలియరాలేదు. ఒకవేళ ఎల్​ఈడీ బెయిల్స్ వాడి ఉంటే షెఫాలీ నాటౌట్​గా నిలిచేదని అంటున్నారు అభిమానులు, మాజీలు. ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ లీసా స్థలేకర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.

ఇవీ చూడండి

Cricket News:టీమ్​ఇండియాకు నిరాశ.. ఇంగ్లాండ్​దే వన్డే సిరీస్

ఇంటిని అమ్మేసిన రోహిత్.. ధరెంతో తెలుసా?

రొనాల్డో ఇన్​స్టా పోస్టుకు రూ.11 కోట్లు.. కోహ్లీకి ఎంత?

ABOUT THE AUTHOR

...view details