Rohit Sharma Fined : 2023 వన్డే ప్రపంచ కప్‌లో అంచనాలకు మించి దూసుకుపోతోంది. టైటిల్ ఫేవరెట్లకు పసికూనలు మైండ్ బ్లాక్ షాక్‌లు ఇస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్‌ను అప్గానిస్థాన్, దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇకపోతే టీమ్ ఇండియా అయితే వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇలాంటి సంచలనాలు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పుడు భారత జట్టు.. మరో పోరుకు సిద్దమైంది. బంగ్లాదేశ్‌తో తలపడనుంది. పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరగనుందీ మ్యాచ్. ఈ టోర్నీలో వరుసగా నాలుగో విజయం కోసం రోహిత్ సేన ఉవ్విళ్లూరుతుండగా.. అఫ్గాన్, నెదర్లాండ్స్ తరహాలో సంచలనం సృష్టించేందుకు బంగ్లాదేశ్ తహతహలాడుతోంది.
Rohit Sharma Lamborghini :అయితే ఈ క్రమంలో ఈ వరల్డ్ కప్ మ్యాచ్ ముంగిట టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ వివాదంలో చిక్కుకున్నాడు! ముంబయి-పుణె మార్గంలో అతడి కారు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించింది. దీంతో పోలీసులు అతడికి జరిమానాలు విధించారు. ఒక దశలో రోహిత్ కారు అత్యధికంగా 215 కి.మీ వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది. వేర్వేరు ప్రదేశాల్లో పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లినందుకు... యజమాని అయిన హిట్‌మ్యాన్‌కు అధికారులు చలానాలు వేశారు.