తెలంగాణ

telangana

By

Published : May 21, 2023, 7:30 PM IST

Updated : May 21, 2023, 8:20 PM IST

ETV Bharat / sports

IPL 2023 MI VS SRH : గ్రీన్ సెంచరీ.. సన్​రైజర్స్ ఓటమి.. ముంబయి ప్లే ఆఫ్స్​ ఆశలు సజీవం

IPL 2023 MI VS SRH : ఐపీఎల్ 16వ సీజన్​లో ముంబయి, హైదరాబాద్​ తమ చివరి లీగ్ మ్యాచ్​ను ఆడేశాయి. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్​లో ముంబయి 8 వికెట్ల తేడాతో గెలిచింది. సన్​రైజర్స్ ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

IPL 2023 Mumbai Indians vs Sunrisers Hyderabad
IPL 2023 MI VS SRH : గ్రీన్ సెంచరీ.. సన్​రైజర్స్ ఓటమి.. ముంబయి ప్లే ఆఫ్స్​ ఆశలు సజీవం

IPL 2023 MI VS SRH : ఐపీఎల్ 2023లో భాగంగా సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన కీలక మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి... కామెరూన్ గ్రీన్​(47 బంతుల్లో 100; 8x4,8x6) మెరుపు సెంచరీ తోడవ్వడంతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఛేదనలో ముంబయి మొదటి నుంచే దూకుడు ప్రదర్శించింది. ఇషాన్​ ఔటయిన తర్వాత వన్​డౌన్​లో వచ్చిన కామెరూన్ గ్రీన్ విశ్వరూపం చూపాడు. బ్యాట్​ను ఝళిపించి సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. కెప్టెన్​ రోహిత్​ శర్మ (37 బంతుల్లో 56; 8x4, 1x6) హాఫ్​ సెంచరీతో చాలా రోజుల తర్వాత ఫామ్​లోకి వచ్చాడు. సెంచరీతో కదం తొక్కిన గ్రీన్​కు 'మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్'​ అవార్డు దక్కింది.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్ నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్​ (46 బంతుల్లో 83 పరుగులు: 8x4,4x6 ), వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 69 పరుగులు9x4, 2x6) అర్ధ సెంచరీలతో చెలరేగిపోయారు. వీరిద్దరూ మొదటి వికెట్​కు 140 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. 13.5 ఓవర్ల వద్ద ఆకాశ్​ మధ్వాల్ వివ్రాంత్ వికెట్​ పడగొట్టి ఈ జోడినీ విడదీశాడు. తర్వాత వచ్చిన క్లాసెన్​(18), ఫిలిప్స్(1)​, బ్రూక్​(0)​ నిరాశ పరిచారు. కెప్టెన్​ మర్​క్రమ్(13) నాటౌట్‌గా నిలిచాడు. ముంబయి బౌలర్లలో ఆకాశ్​ మధ్వాల్​ 4 వికెట్లతో మెరిశాడు. క్రిస్ జోర్డాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

మయాంక్​ ఇదే తొలిసారి​.. గత సీజన్​లో పంజాబ్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్​ను.. మినీ వేలంలో సన్‌రైజర్స్‌ సొంతం చేసుకుంది. సీజన్ ప్రారంభం నుంచి ఘోరంగా విఫలమవుతున్న మయంక్ ముంబయితో మ్యాచ్​లో ఎట్టకేలకు భారీ ఇన్నింగ్స్​ ఆడాడు. ఈ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన మయంక్.. 270 పరుగులు చేశాడు. మయంక్​తో జతగా ఓపెనింగ్​కు వచ్చిన వివ్రాంత్​ శర్మ రెచ్చిపోయి ఆడాడు.

ఆశలు సజీవం.. ఇక ఈ విజయంతో ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు ఓడితే.. ముంబయి 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఆర్సీబీ కూడా గెలిస్తే ఆ జట్టు కూడా 16 పాయింట్లు సాధిస్తుంది. ముంబయి కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్నందున ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్తుతుంది. ముంబయి ఇండియన్స్ ఐదో స్థానంతో టోర్నీని ముగిస్తుంది.

సెంచరీ అనంతరం కామెరూన్​ గ్రీన్

ఐపీఎల్​లో సెంచరీల మోత:
ఐపీఎల్‌ 16వ సీజన్​లో ఇది తొమ్మిదో సెంచరీ. గ్రీన్(100 పరుగులు)​ కంటే ముందు హెన్రిచ్ క్లాసెన్ (104 పరుగులు), విరాట్ కోహ్లీ (100), శుభ్​మన్ గిల్ (101 పరుగులు), ప్రభ్​సిమ్రాన్ సింగ్ (103 పరుగులు) , సూర్యకుమార్ యాదవ్ (103* పరుగులు), యశస్వి జైస్వాల్ (124 పరుగులు), వెంకటేష్ అయ్యర్ (104 పరుగులు), హ్యారీ బ్రూక్ (100* పరుగులు) శతకాలు బాదారు.

ఇవీ చదవండి:

Last Updated : May 21, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details