అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై ముంబయి ఇండియన్స్ ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి.. 19.1ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో సూర్యకుమార్ యాదవ్(74) మెరుపు ఇన్నింగ్స్, బౌలర్ బుమ్రా (3) వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు. ఇషాన్ కిషన్(25) పర్వాలేదనిపించాడు. మిగతా వారు విఫలమయ్యారు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్న తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఆర్సీబీ బౌలర్లో సిరాజ్(2) చాహల్(2), క్రిస్ మోరిస్ ఒక్క వికెట్ తీశారు.
ఆర్సీబీపై విజయం.. ప్లే ఆఫ్స్‌కు ముంబయి
22:56 October 28
22:51 October 28
గెలుపు దిశగా ముంబయి
బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ గెలుపునకు దగ్గరైంది. ప్రస్తుతం 18.5 ఓవర్లకు 158 పరుగులు చేసింది. గెలవాలంటే 7 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి ఉంది.
22:38 October 28
16 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది ముంబయి. ఈ ఓవర్లో పదమూడు పరుగులు వచ్చాయి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడుతుండగా.. హార్దిక్ పాండ్య(8) జాగ్రత్తగా ఆడుతోన్నాడు.
22:28 October 28
15 ఓవర్లో ముంబయికు పది పరుగులు వచ్చాయి. దీంతో 15 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది.
22:17 October 28
12.2 ఓవర్లకు ముంబయి 91 పరుగులు చేసింది. 46 బంతుల్లో 76 పరుగులు అవసరం. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య జాగ్రత్తగా ఆడుతోన్నారు.
21:49 October 28
ముంబయి జోరుకు బ్రేక్
లక్ష్యఛేదనలో బ్యాటింగ్‌ను జోరుగా ప్రారంభించిన ముంబయి ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్వింటన్ డికాక్(18) వెనుదిరిగాడు. ఆరు ఓవర్లు పూర్తయ్యాక వికెట్ కోల్పోయిన రోహిత్ సేన 45 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (23), సూర్య కుమార్ యాదవ్ (3)లు ఉన్నారు.
21:27 October 28
నిలకడగా ముంబయి బ్యాటింగ్
165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి ఇండియన్స్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు డికాక్ (4), ఇషాన్ కిషన్ (11) ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు ఓవర్లకు 15 పరుగులు చేసింది.
21:04 October 28
ముంబయి లక్ష్యం 165
ముంబయి ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 74 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ ఫిలిప్ 33 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా వారిలో కోహ్లీ (9), డివిలియర్స్ (15), దూబే (2), మోరిస్ (4) విఫలమయ్యారు. చివర్లో సుందర్ (10), మన్ (12) నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో రాణించగా.. రాహుల్ చాహర్, పొలార్డ్, బౌల్ట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
20:53 October 28
తడబడుతోన్న బెంగళూరు బ్యాట్స్‌మెన్
ప్రారంభంలో దూకుడుగా కనిపించిన బెంగళూరు చివర్లో తడుబడుతోంది. డివిలియర్స్ (15), దూబే (2), మోరిస్ (4), పడిక్కల్ (74) వెనువెంటనే పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 7 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. ప్రస్తుతానికి 18 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
20:36 October 28
జోరుమీద బెంగళూరు
బ్యాటింగ్‌లో బెంగళూరు దూకుడు కొనసాగిస్తోంది. కోహ్లీ 9 పరుగులే చేసి విఫలమైనా.. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 73 పరుగులతో రెచ్చిపోయి ఆడుతున్నాడు. డివిలియర్స్ (13) ఇతడికి మద్దతిస్తున్నాడు.
20:15 October 28
పడిక్కల్ హాఫ్ సెంచరీ
ప్రారంభంలో నెమ్మదిగా ఆడిన బెంగళూరు మెల్లమెల్లగా జోరు పెంచుతోంది. ఓపెనర్లు ఫిలిప్, పడిక్కల్ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. అనంతరం ఫిలిప్ 33 పరుగులు చేసి రాహుల్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో యువ ఆటగాడు పడిక్కల్ హాఫ్ సెంచరీ (53)తో క్రీజులో ఉన్నాడు. ఇతడికి తోడుగా కోహ్లీ (7) బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో ప్రస్తుతం 11 ఓవర్లకు 93 పరుగులు చేసింది ఆర్సీబీ.
20:00 October 28
దూకుడుగా బెంగళూరు
బెంగళూరు బ్యాటింగ్‌లో జోరు పెంచింది. ఓపెనర్లు ఫిలిప్, పడిక్కల్ దూకుడుగా ఆడుతున్నారు. దీంతో ఆరు ఓవర్లకు 54 పరుగులు చేసింది ఆర్సీబీ,
19:35 October 28
నెమ్మదిగా బెంగళూరు బ్యాటింగ్
ముంబయి ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తోన్న బెంగళూరు నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం రెండు ఓవర్లలో 10 పరుగులు చేసింది. ఫిలిప్ (6), పడిక్కల్ (4) ఆచితూచి ఆడుతున్నారు.
19:08 October 28
జట్లు
బెంగళూరు
దేవదత్ పడిక్కల్, జోష్ ఫిలిప్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, గురుకీరత్ మన్, శివం దూబే, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, డెయిల్ స్టెయిన్, మహ్మద్ సిరాజ్, చాహల్
ముంబయి
ఇషాన్ కిషన్, డికాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా
18:41 October 28
టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
అబుదాబి వేదికగా నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ పోరులో గెలిచిన వారికి ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రోహిత్ సేన అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ సేన మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కూ రోహిత్ దూరమయ్యాడు.