చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో ఘనత సాధించాడు. ఐపీఎల్లో వికెట్ కీపర్‌గా 100 క్యాచ్‌లు పట్టి రికార్డు నెలకొల్పాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం మ్యాచ్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్.. మహీ కంటే ముందున్నాడు. అతడు ఇప్పటివరకు 186 మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లు పట్టాడు.
ఐపీఎల్లో వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డు - వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డు
సీఎస్కే కెప్టెన్ ధోనీ.. ఐపీఎల్లో 100 క్యాచ్‌లు పట్టిన రెండో వికెట్ కీపర్‌గా గుర్తింపు సాధించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌తో ఈ ఘనతను అందుకున్నాడు.
ధోనీ
ఇటీవలే సన్‌రైజర్స్ పోరుతో.. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు(194) ఆడిన ఆటగాడిగానూ ధోనీ రికార్డును సొంతం చేసుకున్నాడు. తన సహచరుడు రైనా(193)ను అధిగమించాడు. చెన్నై తరఫున ధోనీకి ఇది 164వ మ్యాచ్. సీఎస్‌స్కేపై రెండేళ్ల నిషేధం కారణంగా 2016, 17 సీజన్లలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ధోనీ 30 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుత ఆటగాళ్లలో రోహిత్ శర్మ(193), కోహ్లీ(180) ధోనీకి చేరువలో ఉన్నారు.