తెలంగాణ

telangana

ETV Bharat / sports

బెంగళూరు Vs పంజాబ్​: ఆర్సీబీ జోరును కొనసాగిస్తుందా?

బెంగళురూ, పంజాబ్ జట్ల మధ్య గురువారం మ్యాచ్​ జరగనుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

Gayle set for IPL 2020 debut as KXIP face RCB in must-win game
బెంగళూరు Vs పంజాబ్​: ఆర్సీబీ జోరును కొనసాగిస్తుందా?

By

Published : Oct 15, 2020, 5:31 AM IST

ఐపీఎల్​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్లు గురువారం రెండోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్​తో పంజాబ్​ తరఫున విధ్వంసకర బ్యాట్స్​మన్​ క్రిస్​ గేల్​ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆ ఫ్రాంచైజీ ఇటీవలే స్పష్టం చేసింది.

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​లో ఆల్​రౌండ్​ ప్రదర్శన చేయలేకపోవడం సహా ఆడిన ఏడు మ్యాచ్​ల్లో కేవలం ఒక్క మ్యాచ్​లోనే గెలిచింది. అది కూడా ఆర్సీబీపైనే విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో 97 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మరి ఈ మ్యాచ్​లో ఏమవుతుందో చూడాలి.

ప్రతీకారం తీర్చుకుంటుందా?

దుబాయ్​ వేదికగా కోల్​కతాతో ఆడిన గత మ్యాచ్​లో బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో ఆర్సీబీ ఓపెనర్లు దేవ్​దత్​ పడిక్కల్​, ఆరోన్​ ఫించ్​ సహా కెప్టెన్​​ కోహ్లీ, ఏబీ డివిలియర్స్​తో రాణించారు.

బౌలింగ్​లోనూ క్రిస్​ మోరిస్​, వాషింగ్టన్ సుందర్​, నవ్​దీప్​ సైనీలతో పాటు స్పిన్నర్​ చాహల్​ కూడా కోత్​కతాపై అద్భుతమైన ప్రదర్శన చేశారు. అటు బ్యాటింగ్​, ఇటు బౌలింగ్​లోనూ ఆర్సీబీ బలంగా ఉంది. కాబట్టి దాదాపుగా ఈ జట్టులో మార్పులేవి జరగకపోవచ్చు.

గేల్​ అలరిస్తాడా?

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ టోర్నీలో చివరి మ్యాచ్​ను కోల్​కతా నైట్​రైడర్స్​తో ఆడింది. ఇందులో కేవలం రెండు పరుగుల తేడాతో రాహుల్​సేన పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ మ్యాచ్​లో ఓపెనర్లు కెప్టెన్​ కేఎల్​ రాహుల్​, మయాంక్​ అగర్వాల్​ అద్భుతమైన బ్యాటింగ్​ ప్రదర్శన చేసినా అది జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. వీరిద్దరూ పెవిలియన్​ చేరిన తర్వాత మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ ఆకట్టుకులేకపోయారు. ఒకవిధంగా చెప్పాలంటే కోల్​కతా మ్యాచ్​లో మిడిల్ ఆర్డర్​ వైఫల్యం వల్లే చేయిదాకా వచ్చిన విజయం అందకుండా పోయింది. బ్యాటింగ్​ లైనప్​లో స్వల్పమార్పులు జరిగే అవకాశం ఉంది. ఓపెనర్​గా లేదా మిడిల్​ ఆర్డర్​లో క్రిస్​ గేల్​ను ఎంపికే చేయనున్నారని సమాచారం. మరోవైపు బౌలింగ్​ లైనప్​లో టీమ్​ఇండియా పేసర్​ మహ్మద్​ షమి, యువ స్పిన్నర్​ రవి బిష్టోయ్​ తప్ప మిగిలిన వారు ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్నారు.

జట్లు(అంచనా)​:

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్​వెల్, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్, క్రిస్ జోర్డాన్, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమి, మురుగన్ అశ్విన్, అర్ష్​దీప్​ సింగ్​, క్రిస్​ గేల్​, మన్​దీప్​ సింగ్​, దీపక్​ హుడా, మజీబ్​-ఉర్​-రెహమాన్​

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు: విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), ఏబీ డివిలియర్స్​, ఆరోన్ ఫించ్​, జోష్​ ఫిలిప్​, క్రిస్​ మోరిస్​, మొయిన్​ అలీ, మహ్మద్​ సిరాజ్​, షాబాజ్​ అహ్మద్​, దేవదత్​ పడిక్కల్​, యుజ్వేంద్ర చాహల్​, నవ్​దీప్​ సైనీ, డేల్​ స్టెయిన్​, పవన్​ నేగీ, ఇసురు ఉదానా, శివమ్​ దూబే, ఉమేశ్​ యాదవ్​, గుర్కీరత్​ సింగ్​ మన్​, వాషింగ్టన్​ సుందర్​, పవన్​ దేశ్​ పాండే, ఆడమ్​ జంపా

ABOUT THE AUTHOR

...view details