IND vs wI T20: వెస్టిండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. అతనికి తొడకండరం గాయం అయినట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. బెంగళూరలోని నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలించనున్నారు. టీమ్ఇండియా ప్లేయర్స్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్సర్ పటేల్ వెస్టిండీస్‌తో జరగాల్సిన టీ20 సిరీస్‌కు ఇప్పటికే దూరమయ్యారు. వారి స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హూడాకు అవకాశమివ్వనున్నట్లు తెలిపింది బీసీసీఐ.
"తొడకండరం గాయం అయిన కారణంగా సుందర్ ఈ రోజు (సోమవారం) ప్రాక్టీస్ చేయలేదు. వచ్చే టీ20 సిరీస్‌కు అతను ఆడేలా కనిపించట్లేదు."