Ind Vs Eng Warmup Match : ఈ ఏడాదికిగాను జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు సందడి మొదలైంది. శుక్రవారం నుంచే వార్మప్ మ్యాచ్‌లకు ప్రారంభమవ్వగా.. రానున్న గురువారం (అక్టోబర్ 5న) ప్రధాన టోర్నీ మొదలవ్వనుంది. ఇక తొలిసారిగా భారత్‌లోనే పూర్తిగా జరగనున్న ఈ ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం పది స్టేడియాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఆయా జట్లు కూడా భారత్‌కు చేరుకుని కసరత్తులను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా కూడా సన్నాహకాలు మొదలెట్టింది.
అయితే ఇప్పటివరకు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఉన్న సందేహాలన్నీ తాజాగా తొలగిపోయాయి. ప్రపంచకప్ జట్టులో ఎవరుంటారు..? ఎవరు ఎక్కడ ఆడతారు అన్న విషయాలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్ రాకతో తుది జట్టు సమరం కోసం రంగంలోకి దిగనుంది. అయితే జట్టుకు ఇప్పుడు కావాల్సిదంతా ఒక్కటే.. ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌కు సిద్ధం కావడమే. ఇక పూర్తి స్థాయి జట్టుతో బరిలో దిగి రాణించేందుకు రెడీగా ఉన్న రోహిత్ సేన.. శనివారం తొలి అడుగు వేయనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గి ఉత్సాహంతో ఉన్న టీమ్ఇండియా.. ఇంగ్లాండ్‌తో సన్నాహక మ్యాచ్‌లోనూ సత్తా చాటాలని కోరుకుంటోంది.
మరోవైపు ఇంగ్లాండ్ జట్టు కూడా తమ ప్లేయర్లపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. దీంతో ఇరు జట్లు వీలైనంత ఎక్కువ మంది ఆటగాళ్లను మైదానంలోకి దించనున్నాయి. వాస్తవానికి వార్మప్ మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా తమ మాస్టర్ ప్లాన్స్‌ను బయట పెట్టదు. కానీ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించడాన్ని ఇంగ్లాండ్ అలవాటుగా మార్చుకుంది. బెయిర్‌స్టో, మలన్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, లివింగ్‌స్టోన్, మొయీన్ అలీల లాంటి ప్లేయర్ల విధ్వంసక బ్యాటింగ్.. ఆ జట్టులోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో తమ బౌలర్లను పరీక్షించుకోడానికి ఇంగ్లాండ్‌తో వార్మప్ పోరు మంచి అవకాశమని భారత్ భావిస్తోంది. ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. గాయంతో శ్రేయస్ జట్టుకు దూరమైన సమయంలో ఇషాన్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. అయితే మధ్య ఓవర్లలో స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే శ్రేయస్ పట్ల జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది.
ICC World Cup 2023 India Squad : అక్షర్ స్థానంలో అశ్విన్.. జట్టులో మార్పునకు కారణం అదే!.. 'ఈటీవీ భారత్' ఎక్స్క్లూసివ్
World cup 2023 Team India : కప్ ముందు టీమ్‌ఇండియాకు ఓటమి నేర్పిన పాఠాలు.. ఇక అలా చేస్తే తిరుగుండదు!