టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya News) భుజానికి తగిలిన గాయం తీవ్రమైంది కాదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో అక్టోబరు 31న న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో(ind vs pak match) ఆదివారం(అక్టోబరు 24) జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా హార్దిక్ కుడి భుజానికి గాయమైంది. దీంతో పాక్ ఇన్నింగ్స్‌లో అతడు ఫీల్డింగ్‌కు రాలేదు. అతడి బదులు ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 8 బంతుల్లో 11 పరుగులు చేశాడు హార్దిక్.
ముందు జాగ్రత్తగా పాండ్యాను స్కానింగ్ కోసం పంపించినట్లు బీసీసీఐ వెల్లడించింది. పాండ్యాకు ఎలాంటి సమస్య లేదని, ఫిట్‌గానే ఉన్నట్లు పేర్కొంది.