తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: నిలకడగా ఆడిన బంగ్లాదేశ్.. కివీస్ లక్ష్యం 245

లండన్ ఓవల్ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో బంగ్లాదేశ్ 244 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా ఆటగాడు అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 4 వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్​ రెండు వికెట్లు తీశాడు.

WC19: నిలకడగా ఆడిన బంగ్లాదేశ్.. కివీస్ లక్ష్యం 245

By

Published : Jun 5, 2019, 9:48 PM IST

Updated : Jun 5, 2019, 10:24 PM IST

న్యూజిలాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో బంగ్లాదేశ్ 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. లండన్ ఓవల్​ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో షకీబ్ అల్ హసన్(64)​ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మిగతా బ్యాట్స్​మెన్ నిలకడగా ఆడారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 4 వికెట్లతో రాణించగా.. బౌల్ట్​ రెండు.. ఫెర్గ్యూసన్, గ్రాండ్​హోమ్, మిషెల్ సాంట్నర్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బంగ్లాదేశ్​కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు 45 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సౌమ్యా సర్కార్​(25)ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు హెన్రీ. కాసేపటికే మరో ఓపెనర్​ తమీమ్(24)​ ఫెర్గ్యూసన్ బౌలింగ్​లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షకీబ్.. ముష్ఫీకర్ సాయంతో ఇన్నింగ్స్​ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ జోడీ 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది.

షకీబ్ అర్ధశతకం..

దక్షిణాఫ్రికాపై అర్ధశతకంతో ఆకట్టుకున్న షకీబ్ మరోసారి సత్తాచాటాడు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ ఇన్నింగ్స్​ వేగం పెంచాడు. 68 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. ముష్ఫీకర్ రహీమ్(19) రనౌటైన తర్వాత మిథున్​తో కలిసి ఇన్నింగ్స్​ నిర్మించే ప్రయత్నం చేశాడు షకీబ్​. చివరికి గ్రాండ్​హోమ్​ బౌలింగ్​లో ఔటయ్యాడు.

షకీబ్ ఔటైన తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ గాడి తప్పింది. వేగంగా పరుగులు రాబట్టడంలో బ్యాట్స్​మెన్ విఫలమయ్యారు. తర్వాత వచ్చిన మొహమ్మదుల్లా 20 పరుగులు చేసి ఔట్​ కాగా..హుస్సేన్ 11 పరుగులకే పెవిలియన్ చేరాడు.

కివీస్ బౌలర్లు పరుగులు కట్టడి చేస్తూ బంగ్లా బ్యాట్స్​మెన్​ను ఇబ్బంది పెట్టారు. చివర్లో ధాటిగా ఆడేందుకు బంగ్లా బ్యాట్స్​మెన్ కష్టపడ్డారు.

Last Updated : Jun 5, 2019, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details