వన్డే ప్రపంచకప్‌లో ఎట్టకేలకు అవకాశం దక్కించుకున్నాడు రిషభ్ పంత్. నేడు ఆతిథ్య జట్టుతో మ్యాచ్‌లో టీమిండియా నాలుగో స్థానంలో పంత్‌ను ఎంపిక చేసింది. ఫలితంగా కెరీర్లో తొలి మెగాటోర్నీలో బరిలోకి దిగనున్నాడు. 5 అంతర్జాతీయ వన్డేలు ఆడిన పంత్ 93 పరుగులు మాత్రమే చేశాడు. 36 రన్స్ అత్యధికం. 21 ఏళ్ల వయసులో తక్కువ మ్యాచ్‌లు ఆడి ప్రపంచకప్‌లో స్థానం పొందిన ఏకైక ఆటగాడు రిషభ్.
ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పంత్‌కు ఛాన్స్ - cwc19
ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు టీమిండియా యువఆటగాడు రిషభ్ పంత్‌కు అవకాశం లభించింది. కెరీర్లో తొలిసారి ప్రపంచకప్ మ్యాచ్ ఆడుతున్నాడు. అందులోనూ మొదటి మ్యాచ్‌లో బలమైన ప్రత్యర్థి ఇంగ్లీష్ జట్టుతో పోటీకి సిద్ధమవుతున్నాడు.
ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పంత్‌కు ఛాన్స్
ఇప్పటికే కోహ్లీసేన ఆరు మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఓటమి ఎరుగని జట్టుగా దూసుకుపోతోంది. ఒక మ్యాచ్ రద్దవ్వడం వల్ల 11 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఈరోజు ఇంగ్లాండ్ జట్టుతో తలపడే మ్యాచ్‌లో గెలిచి సెమీస్ బెర్తును ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు రెండు వరుస ఓటములతో ఉన్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.