ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఆరో మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీస్కోరు చేసింది. ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 8 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది పాక్. మొహమ్మద్ హఫీజ్(84), బాబర్ అజామ్(55), సర్ఫరాజ్ అహ్మద్(55) అర్ధశతకాలతో అదరగొట్టారు. ఇంగ్లీష్ బౌలర్లలో మొయిన్ అలీ, వోక్స్ 3 వికెట్లతో రాణించారు. మార్క్‌వుడ్ రెండు వికెట్లు తీశాడు.
ఆరంభం అదిరింది..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఫఖార్ జమాన్, ఇమామ్ ఉల్ హఖ్ తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మొయిన్ అలీ.. ఫఖార్ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అనంతరం బ్యాటింగ్‌కొచ్చిన బాబర్ అజామ్ నిలకడగా ఆడాడు. కాసేపటికే ఇమామ్ ఔటైనా క్రీజులో పాతుకుపోయాడు.
హఫీజ్, బాబర్, సర్ఫరాజ్ అర్ధశతకాలు..
ఇమామ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హఫీజ్ బాబర్ సాయంతో స్కోరు బోర్డు వేగం పెంచాడు. మొదట బాబర్ అర్ధశతకం చేయగా.. అనంతరం హఫీజ్ 50 పరుగులు పూర్తి చేశాడు. వీరిరువురు 88 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. అనంతరం మొయిన్ అలీ బౌలింగ్‌లో బాబర్ ఔటయ్యాడు.
చివర్లో ధాటిగా ఆడటం మొదలు పెట్టిన పాక్ భారీస్కోరు దిశగా పయనించింది. వేగంగా ఆడుతూ హఫీజ్ ఔటయ్యాడు. అనంతరం సర్ఫరాజ్ అహ్మద్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 311 పరుగులకు నాలుగు వికెట్లతో పటిష్ఠ స్థితిలో ఉన్న పాక్ 40 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది.ఇంగ్లాండ్‌కు 349 పరుగులు లక్ష్యం నిర్దేశించింది.