మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్ ఇంగ్లాండ్ ఆటగాళ్లకు బౌలింగ్ చేశాడు. అయితే అసలు మ్యాచ్‌లో కాదు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ సన్నాహకాల్లో. ఆస్ట్రేలియాతో నేడు తలపడనున్న నేపథ్యంలో ఇంగ్లీష్ జట్టు లార్డ్స్ మైదానంలోసోమవారం ముమ్మర ప్రాక్టీస్ చేసింది. ఆ సమయంలో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేశాడు అర్జున్.
ఎడమ చేతివాటం బౌలింగ్‌తో ఇంగ్లీష్ ఆటగాళ్లకు సమర్థవంతంగా బంతులు సంధించాడు అర్జున్. ప్రస్తుతం ఎంసీసీ యంగ్ క్రికెటర్స్ తరపున ఆడుతున్నాడు. గత ఏడాది భారత్ తరపున అండర్- 19 క్రికెట్ మ్యాచ్ శ్రీలంకతో ఆడాడు.