టీమ్‌ఇండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ దంపతులు విహారయాత్రలో మునిగిపోయారు. లాక్‌డౌన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వీరు డిసెంబర్‌లో ఒక్కటయ్యారు. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ తర్వాత విశ్రాంతి దొరికిన సమయంలో వీరిద్దరి వివాహం నిరాడంబరంగా జరిగింది.
మాల్దీవుల్లో సేదతీరుతున్న చాహల్- ధనశ్రీ జంట
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ దంపతులు మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లారు. గతేడాది వివాహబంధంతో ఒక్కటైన వీరిద్దరూ.. మాల్దీవుల్లోని సముద్ర తీరం వెంబడి సేద తీరుతున్నారు. వాళ్లకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మాల్దీవుల విహారంలో చాహల్ దంపతులు
అలా జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన చాహల్ దంపతులు ఇప్పుడు విహారయాత్రకు వెళ్లారు. ప్రముఖ వెకేషన్ డెస్టినేషన్ మాల్దీవ్స్‌కు వెళ్లి.. ప్రశాంతమైన సముద్ర జలాల్లో సేద తీరుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ తీసుకున్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోలు ఎంతో అందంగా ఉండడం వల్ల నెటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా వాటిపై ఓ లుక్కేయండి..
ఇదీ చూడండి:వివాహ బంధంతో ఒక్కటైన చాహల్- ధనశ్రీ
Last Updated : Mar 2, 2021, 8:17 PM IST