శ్రీలంక క్రికెట్లో కలకలం రేగింది. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో ఆడుతున్న లంక జట్టులోని ఓ యువ ఆటగాడి లైంగిక దుష్ప్రవర్తనపై నివేదిక సమర్పించాలని టీమ్ మేనేజర్ అశాంత డిమెల్ను శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఆదేశించింది. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండరైన ఆ యువ ఆటగాడు.. తమ జట్టు సహాయక సిబ్బందిలోని ఓ మహిళతో హోటల్ గదిలో పట్టుబడ్డట్లు తెలుస్తోంది. దీంతో సదరు ఆటగాడి ప్రవర్తనపై మీడియాలో దుమారం చెలరేగింది.
"ప్రధాన మీడియా వెలుగులోకి తెచ్చిన ఈ సంఘటన తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నిజ నిర్ధారణ నివేదికను సమర్పించాల్సిందిగా జట్టు మేనేజర్ అశాంతను ఆదేశించాం".