టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌పై బీసీసీఐ వేటు వేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ కామెంటరీ ప్యానెల్ నుంచి అతడిని తొలగించారని సమాచారం. కొన్నేళ్లుగా భారత స్వదేశీ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అతను ఈసారి ఐపీఎల్‌లోనూ కనిపించకపోవచ్చు. అయితే మంజ్రేకర్‌ను తొలగించడానికి గల కారణాలు తెలియరాలేదు. బీసీసీఐ అధికారులకు అతని పనితీరు నచ్చలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
"ఐపీఎల్ ప్యానెల్ నుంచి కూడా అతడిని తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది మా ఆలోచనల్లో లేదు. అసలు నిజం ఏంటంటే మంజ్రేకర్ పనితీరు పట్ల అధికారులు సంతోషంగా లేరు"