తెలంగాణ

telangana

ETV Bharat / sports

సానియా సోదరితో అజారుద్దీన్​ తనయుడి పెళ్లి - Sania Mirza's sister Anam to marry Mohammad Azarhuddin's son Asad in December

ప్రముఖ టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా ఇంటిలో పెళ్లిసందడి మొదలుకానుంది. ఆమె సోదరి ఆనం మీర్జా, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ తనయుడు అసద్​ వివాహం చేసుకోనున్నారు. ఈ విషయం సానియా అధికారికంగా వెల్లడించింది.

సానియా

By

Published : Oct 7, 2019, 5:33 PM IST

తన అక్క బాటలోనే నడుస్తోంది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా. టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తనయుడు అసద్​ను వివాహం చేసుకోనుంది ఆనం. డిసెంబరులో వీరి పరిణయం జరగనుంది.

కొద్దికాలంగా అసద్ - ఆనం ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని ధృవీకరిస్తూ... పెళ్లితో అసద్ - ఆనం ఒక్కటవుతున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సానియా. అతడి ఫొటో పెట్టి ఫ్యామిలీ అని ఇన్​స్టాలో పోస్టు చేసింది సానియా.

"ఆనం డిసెంబరులో పెళ్లి చేసుకోనుంది. బ్యాచిలర్ ట్రిప్​లో భాగంగా ఈరోజే పారిస్ నుంచి తిరిగొచ్చాం. మేము ఈ వివాహం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం. ఆమె ఓ మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది. అతడు అజారుద్దీన్ తనయుడైన అసద్​ అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది" -సానియా మీర్జా, టెన్నిస్​ క్రీడాకారిణి

పాక్ క్రికెటర్ షోయబ్​ మాలిక్​ను వివాహం చేసుకుంది సానియా మీర్జా. ఇప్పుడూ ఆమె సోదరి కూడా క్రికెట్ నేపథ్యమున్న వ్యక్తినే పెళ్లి చేసుకోనుండటం విశేషం.

ఇదీ చదవండి: వన్డేల్లో రెండో స్థానంలోనే మహిళా టీమిండియా

ABOUT THE AUTHOR

...view details