కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే గడుపుతున్న పలువురు క్రీడాకారులు వినోదకరమైన వీడియోలను పోస్టు చేస్తూ అభిమానుల చేత కడుపుబ్బా నవ్విస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పడు చురుగ్గా ఉండే టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో ప్రస్తుతం అభిమానుల చేత పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది.
రజనీకాంత్ వీడియోతో అశ్విన్ క్రికెట్ కోచింగ్! - రజనీకాంత్ ఫైటింగ్ సీన్... నవ్వులే నవ్వులు
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్... రజనీకాంత్ సినిమాలోని ఓ యాక్షన్ వీడియో సీన్‌ను పోస్ట్ చేశాడు. అది చూసిన నెటిజన్లు విపరీతంగా పడి నవ్వుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలోని ఓ ఫైటింగ్ సీన్ వీడియోను పోస్టు చేశాడు అశ్విన్. అందులో విలన్లు రజనీకాంత్‌పై బాంబులు విసురుతుంటారు. వాటిని సాహసోపేతంగా గాల్లో ఎగిరి ఫీట్లు చేస్తూ ఒడుపుగా పట్టుకుని తిరిగి వారిపైకే విసురుతుంటాడు రజనీ. ఆన్‌లైన్ కోచింగ్ అలెర్ట్ అన్న అశ్విన్.. ఇంటి వద్ద అందరూ ఈ ఫీల్డింగ్ డ్రిల్స్‌ను ప్రాక్టీస్ చేయాలని కోరాడు. అయితే, చిన్న షరతు కూడా పెట్టాడు. బాంబులతో కాకుండా సాఫ్ట్ బాల్స్‌తో మాత్రమే ప్రాక్టీస్ చేయాలని సూచించాడు. ఇది చూసిన అభిమానులు ఇలాంటివే మరిన్ని వీడియోలు పోస్టు చేసి అదిరే కామెంట్లు చేస్తున్నారు.
TAGGED:
Rajinikanth Video viral