అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో(బీబీఎల్) అదరగొడుతున్నాడు. అడిలైడ్ స్ట్రైకర్స్‌కు ఆడుతున్న రషీద్.. మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో మ్యాచ్‌లో సరికొత్త బ్యాట్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం 16 బంతుల్లోనే 25 పరుగులు సాధించాడు. ఇందులో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అలాగే 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి, 2 వికెట్లు తీసిన ఈ అఫ్గాన్ సంచలనం.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
'రషీద్.. ఆ బ్యాట్ ఐపీఎల్‌కు తీసుకురా' - బిగ్‌బాష్ లీగ్
బిగ్‌బాష్ లీగ్‌లో సరికొత్త బ్యాట్‌తో కనువిందు చేశాడు అఫ్గాన్ ఆటగాడు రషీద్ ఖాన్. మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. అయితే ఈ బ్యాట్ విషయమై సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పందించింది.

రషీద్
అయితే రషీద్ ఉపయోగించిన ఈ బ్యాట్‌ను 'ద కెమల్' అని పేర్కొంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. దీనిపై ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరబాద్ స్పందించింది. "రషీద్ ఆ బ్యాట్‌ను 2020 ఐపీఎల్‌కు తీసుకురా" అంటూ ట్వీట్ చేసింది. బదులిచ్చిన రషీద్.. "ఐపీఎల్ 2020కి తప్పకుండా కెమల్ బ్యాట్ తీసుకువస్తా" అని రాసుకొచ్చాడు.
ఇవీ చూడండి.. విజ్డెన్ దశాబ్దపు టీ20 జట్టులో కోహ్లీ, బుమ్రా