తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిరీస్​పై కన్నేసిన భారత్.. విజయం కోసం సఫారీల చూపు!

పుణె వేదికగా ఈ రోజు దక్షిణాఫ్రికా - భారత్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్​ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ప్రొటీస్ జట్టు చూస్తుంటే... సిరీస్ చేజిక్కించుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది.

టీమిండియా

By

Published : Oct 10, 2019, 6:00 AM IST

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం అందుకున్న టీమిండియా సిరీస్​పై కన్నేసింది. గురువారం జరగనున్న రెండో టెస్టుకు పుణె ఆతిథ్యమివ్వనుంది. ఇందులో గెలిచి.. మరో టెస్టు మిగిలుండగానే సిరీస్​ను ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది కోహ్లీసేన.

రెండో టెస్టులోనూ జోరు కొనసాగిస్తారా..

టెస్టుల్లో ఓపెనర్ అవతారమెత్తిన రోహిత్.. తొలి మ్యాచ్​లోనే జట్టు విజయంలో కీలక పాత్ర(రెండు శతకాలు) పోషించాడు. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా విజృంభించాడు హిట్​మ్యాన్​.

తొలి టెస్ట్​లో రోహిత్​తోపాటు మయాంక్ అగర్వాల్ ​కూడా చెలరేగి ఆడాడు. కెరీర్​లో తొలి ద్విశతకాన్ని నమోదు చేశాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. రెండో టెస్టులోనూ ఇదే జోరును కొనసాగించే దిశగా నెట్స్​లో శ్రమిస్తున్నాడు మయాంక్.

రోహిత్ శర్మ

ఒకవేళ పుణె పిచ్ బౌలింగ్​కు సహకరిస్తే మన భారత బ్యాట్స్​మన్ ఆచితూచి ఆడాల్సి ఉంటుంది.కోహ్లీ సారథ్యంలోఇప్పటి వరకు సొంత గడ్డపై జరిగిన మ్యాచ్​ల్లో ఈ ఒక్క పిచ్​పైనే ఓటమి చవిచూసింది టీమిండియా. 2017లో ఆసీస్​పై పరాజయం పాలైంది. అయితే కోహ్లీ, పుజారా, అజింక్య రహానే, హనుమ విహారీతో బలమైన బ్యాటింగ్ లైనప్ భారత్ సొంతం.

బౌలింగ్​లో అశ్విన్​, జడేజా తమ స్పిన్​ మాయాజాలంతో ఆకట్టుకుంటున్నారు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో మహ్మద్​ షమీ 5 వికెట్లతో అలరించాడు. తొలి టెస్టులో పెద్దగా రాణించని ఇషాంత్.. పుణె మ్యాచ్​లో సత్తాచాటాలని ఆశిస్తున్నారు అభిమానులు

విరాట్ కోహ్లీ

దక్షిణాఫ్రికా పుంజుకునేనా..

తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో పోటీనిచ్చిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్​లో పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైంది. ఈ సారి ఆ తప్పు పునరావృతం కాకుండా సత్తా చాటాలనుకుంటోంది. రెండో టెస్టులో నెగ్గి సిరీస్ ఆశలు సజీవం చేసుకోవాలనుకుంటోంది సఫారీ జట్టు.

మొదటి టెస్టులో ఎల్గార్, డికాక్ శతకాలతో ఆకట్టుకున్నారు. రెండో ఇన్నింగ్స్​లో డేన్ వీరోచితంగా ఆడి అర్ధశతకం చేశాడు. డుప్లెసిస్ ఫర్వాలేదనిపించినా మిగతా వారు గాడిలో పడాల్సిన అవసరం ఉంది. బౌలింగ్​లో లుంగీ ఎంగిడి, కగిసో రబాడా, ఫిలాండర్ లాంటి మేటి పేసర్లు ఆ జట్టు సొంతం. అయితే తొలి టెస్టులో వీరు పెద్దగా రాణించలేకపోయారు.

వర్షం ముప్పు..

పుణె వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​కు వరుణుడు ముప్పు పొంచి ఉంది. బుధవారం మధ్యాహ్నం కూడా వర్షం పడింది.

ఇదీ చదవండి: ప్రియ పునియా విధ్వంసం​​... టీమిండియా ఘన విజయం

ABOUT THE AUTHOR

...view details