తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2020, 2:54 PM IST

ETV Bharat / sports

సెంచరీతో ఆదుకున్న రహానే.. భారత్ 237/8

ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతోన్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్​లో భారత్​-ఎ జట్టు తొలిరోజు ఆట ముగిసే సరికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెప్టెన్ రహానే శతకంతో మెరిశాడు.

Rahane Unbeaten century in Australia A vs India A Practice match
ఆసీస్​తో ప్రాక్టీస్​ మ్యాచ్​లో రహానే సెంచరీ

ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌-ఎ జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెప్టెన్‌ అజింక్య రహానె (108*) శతకంతో సత్తాచాటగా, పుజారా (54) అర్ధశతకం సాధించాడు. కాగా, మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. ఓపెనర్లు పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరారు. హనుమ విహారి (15) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానెతో కలిసి పుజారా వికెట్ల పతనాన్ని ఆపాడు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో అర్ధశతకాలు అందుకున్నారు. కాగా, పుజారాను ప్యాటిన్సన్‌ ఔట్‌ చేసి మరోసారి భారత్‌-ఎ జట్టును దెబ్బతీశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా (0), అశ్విన్‌ (5) కూడా విఫలమవ్వడం వల్ల జట్టు స్కోరు 170 పరుగులు కూడా దాటదనిపించింది. కానీ రహానె టెయిలెండర్లతో కలిసి గొప్పగా ఆడాడు. అజేయ శతకంతో తొలి రోజు ఆఖరి వరకు క్రీజులో నిలబడ్డాడు. కుల్‌దీప్‌ (15), ఉమేశ్‌ యాదవ్‌ (24) పరుగులు సాధించారు. ఆసీస్‌-ఎ జట్టు బౌలర్లలో ప్యాటిన్సన్‌ మూడు, మైకేల్‌ నెసర్‌, ట్రేవెస్‌ హెడ్ చెరో రెండు, బర్డ్ ఒక్క వికెట్‌ తీశారు.

ABOUT THE AUTHOR

...view details