తెలంగాణ

telangana

ETV Bharat / sports

కూలిన విమానం.. టీమ్​ఇండియాకు తప్పిన ప్రమాదం - Plane crashes team india

సిడ్నీలో టీమ్​ఇండియా ఆటగాళ్లు క్వారంటైన్​లో ఉన్న ప్రదేశానికి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న మైదానంలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Indian cricket team
టీమ్​ఇండియా

By

Published : Nov 15, 2020, 7:37 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా ఆటగాళ్లకు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం వారు సిడ్నీలో క్వారంటైన్​లో ఉన్న ప్రదేశానికి 30కిలోమీటర్ల దూరంలోని ఓ మైదానంలో విమానం కూలింది. శనివారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అక్కడి మీడియా తెలిపింది.

విమానం కూలిన సమయంలో ఆ మైదానంలో స్థానిక క్రికెటర్లు, ఫుట్​బాల్​ ఆటగాళ్లు మ్యాచ్​లు ఆడుతున్నారు. అదృష్టం కొద్దీ వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. విమానంలో ఉన్న ఇద్దరు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

నవంబర్​ 27 నుంచి జనవరి 19 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా ఆసీస్​-భారత్​ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.

ఇదీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details