తెలంగాణ

telangana

By

Published : Oct 15, 2019, 5:38 AM IST

ETV Bharat / sports

లంక వర్సెస్​ పాక్​: 'అంత చేస్తే అలా మాట్లాడతారా..'

పాకిస్థాన్ పర్యటనలో ఇబ్బందులు పడ్డామని తెలిపిన లంక బోర్డు అధ్యక్షుడి మాటలపై స్పందించింది పీసీబీ. ఆ వాఖ్యలు అసహనానికి గురి చేశాయని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

పాక్

పాకిస్థాన్​లో శ్రీలంక పర్యటన పూర్తయింది. కరాచీ వేదికగా జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో పాక్ కైవసం చేసుకోగా.. మూడు టీ20ల సిరీస్‌ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. అయితే పాక్ పర్యటనను ముగించుకుని కొలంబోకు చేరుకున్న తర్వాత భద్రత విషయంలో అసహనం వ్యక్తం చేశాడు శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వ. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పందించింది.

"ఆతిథ్య జట్టుకు మా బోర్డు పట్టు బట్టి మరీ అధ్యక్ష స్థాయి భద్రత కల్పించేలా చేసింది. అయినా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా నిరాశ కలిగించింది. మేము వారి బసను వీలైనంత సౌకర్యవంతంగా చేయాలనుకున్నాం"

-బోర్డు ఉన్నతాధికారి

ఈ ఏడాది డిసెంబర్‌లో శ్రీలంక జట్టు మళ్లీ టెస్టు సిరీస్‌ ఆడేందుకు పాక్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ పరిమిత ఓవర్ల మ్యాచులకే ఇంత ఇబ్బంది పడ్డామని.. ఈ విషయంపై ఆటగాళ్లతో చర్చిస్తామని షమ్మి సిల్వ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

భద్రతా కారణాల దృష్ట్యా లంక సీనియర్ ఆటగాళ్లు ఈ పర్యటనకు వెళ్లలేదు. ఈ కారణంగా లంక బోర్డు ద్వితీయ శ్రేణి జట్టును పాక్ పర్యటనకు పంపింది.

ఇవీ చూడండి.. దక్షిణాఫ్రికాను క్లీన్​స్వీప్ చేసిన భారత అమ్మాయిలు

ABOUT THE AUTHOR

...view details