టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పరుగుల రారాజు విరాట్ కోహ్లీ, నయావాల్ చెతేశ్వర్ పుజారా, టెస్టు స్పెషలిస్టులు అజింక్య రహానె, మురళీ విజయ్‌కు సైతం లేని ఘనత సాధించాడు. గత పదేళ్లలో ఆసీస్‌లో కనీసం 500+ పరుగులు చేసినవారిలో అత్యధిక సగటు నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు.
కంగారూ గడ్డపై గత పదేళ్లలో రిషభ్ పంత్ 6 మ్యాచులు ఆడగా 56.88 సగటుతో 512 పరుగులు చేశాడు. ఆసీస్‌పై అతనెప్పుడూ 25కు తక్కువ పరుగులు చేయనేలేదు. 2019లో ఇదే సిడ్నీ వేదికపై పంత్ సింహగర్జన చేశాడు. కేవలం 189 బంతుల్లో 159 పరుగులతో అజేయంగా నిలిచాడు. మళ్లీ అదే సిడ్నీలో ప్రస్తుతం 118 బంతుల్లో 97 చేయడం గమనార్హం. ఇక విరాట్ కోహ్లీ ఆసీస్‌లో 13 మ్యాచుల్లో 54.08 సగటుతో 1352 పరుగులు చేయడం ప్రత్యేకం. చెతేశ్వర్ పుజారా 10 మ్యాచుల్లో 48 సగటుతో 912, మురళీ విజయ్ 6 మ్యాచుల్లో 44.25 సగటుతో 531, అజింక్య రహానె 11 మ్యాచుల్లో 43.41 సగటుతో 823 పరుగులు సాధించారు. సగటు విషయంలో ఆసీస్‌పై టీమ్‌ఇండియా ఆటగాళ్లదే హవా. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ 7 మ్యాచుల్లో 42.84 సగటుతో 557, అలిస్టర్ కుక్ 11 మ్యాచుల్లో 42.68 సగటుతో 811, రాస్ టేలర్ 8 మ్యాచుల్లో 42.20 సగటుతో 633, జో రూట్ 9 మ్యాచుల్లో 38 సగటుతో 570 తర్వాతి స్థానాల్లో ఉన్నారు.