ఐపీఎల్‌కు ముందు తన జట్టులోని ఆటగాళ్లతో వర్చువల్‌గా మాట్లాడాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ. బయో బబుల్ వాతవరణానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశాడు. చిన్న తప్పు జరిగినా ఆ ప్రభావం పూర్తి టోర్నీపై పడుతుందని, ఒకవేళ జరిగితే మాత్రం సహించేది లేదని హెచ్చరించాడు. ఆటగాళ్లందరూ బాధ్యతగా వ్యవహరించేలా చూడడం ఓ సారథిగా తన బాధ్యతని చెప్పాడు.
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెసన్ చెప్పారు. వారిని ఏడు రోజులు క్వారంటైన్లో ఉంచి.. తర్వాత వైరస్ నిర్థరణ పరీక్షల్లో నెగిటివ్‌గా తేలితేనే తిరిగి ఆడేందుకు అనుమతిస్తామని అన్నారు.