కరోనా ప్రభావంతో మార్చి నుంచి దేశవాళీ టోర్నీలను నిర్వహించని బీసీసీఐ.. వచ్చే జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్ అలీ ట్రోఫీ జరపనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆరు రాష్ట్రాల్లో బయో బబుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కర్ణాటక జట్టు జమ్మూ కశ్మీర్‌తో తలపడనుంది.
మోతెరాలో సయ్యద్ ముస్తాక్ అలీ నాకౌట్ మ్యాచ్‌లు
కరోనా ప్రభావంతో వాయిదాపడిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ జనవరి 10న ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లో నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
మొతేరాలో సయ్యద్ అలీ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లు
బెంగళూరు, కోల్‌కతా, వడోదరా, ఇండోర్‌తో పాటు ముంబయి ఈ మ్యాచ్‌లకు వేదికలుగా నిలవనున్నాయి. అహ్మదాబాద్‌లోని కొత్త మైదానం మోతెరా నాకౌట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 29న సెమీస్, 31న ఫైనల్స్ జరగనున్నాయి.
ఈ టోర్నీ కోసం జనవరి 2,4,6 తేదీల్లో మూడు విడతలుగా ఆటగాళ్లతో పాటు సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. ఇందులో నెగిటివ్ వచ్చిన వారు జనవరి 8న నుంచి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటారు.