రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై ఓటమి చెందింది. అయితే రెండో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పోటీకి సిద్ధమవుతోంది. నేడు హైదరాబాద్ ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మన్కడింగ్ ద్వారా బట్లర్‌ని కోల్పోవడం వల్ల పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది రాజస్థాన్. తొలి మ్యాచ్ ప్రభావం ప్రస్తుత మ్యాచ్‌పై ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశాడు రాజస్థాన్ రాయల్స్ పేసర్ జయదేవ్ ఉనద్కత్.
'ఇలాంటి టోర్నమెంటులో ప్రతి మ్యాచ్ ముఖ్యమైనదే. మన్కడింగ్ లాంటి అంశాలు మా మీద పెద్దగా ప్రభావం చూపవు. మేము ఆ విషయాన్ని ఆ రోజే మరిచిపోయాం. తరువాత ఎలా గెలవాలన్న అంశాన్నే దృష్టిలో పెట్టుకున్నాం.'
--జయదేవ్ ఉనద్కత్, రాజస్థాన్ బౌలర్