అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా దూసుకెళ్తోంది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు నేడు జపాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ సత్తాచాటారు. 10 వికెట్ల తేడాతో గెలిచి తమ ఆధిపత్యాన్ని చూపించారు.
మొదట టాస్ గెలిచిన భారత్ ముందుగా జపాన్‌కు బ్యాటింగ్ అప్పగించింది. టీమిండియా బౌలర్లు విజృంభించి పసికూన జట్టును 22.5 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌట్ చేశారు. వీరి ధాటికి ఒక్క బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్ చేయలేకపోవడం విశేషం. అండర్-19 ప్రపంచకప్‌లో ఇదే సంయుక్త అత్యల్ప స్కోర్. భారత బౌలర్లలో రవి బిష్నోయ్ 4 వికెట్లతో సత్తాచాటాడు. 8 ఓవర్లు వేసిన ఈ యువ బౌలర్ 3 మెయిడెన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కార్తీక్ త్యాగీ మూడు, ఆకాశ్ సింగ్ రెండు, విద్యాధర్ పాటిల్ ఒక వికెట్‌తో ఆకట్టుకున్నారు.