తెలంగాణ

telangana

ETV Bharat / sports

కిడ్నాప్​ కేసులో ముంబయి మాజీ క్రికెటర్​ అరెస్ట్​ - Last year Morris was caught in a sting operation

మాజీ రంజీ ప్లేయర్​ రాబిన్​ మోరిస్​ను పోలీసులు అరెస్టు చేశారు. లోన్​ ఏజెంట్​ అపహరణ ​కేసులో ఈ ముంబయి ఆటగాడు సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు గురువారం అధికారులు వెల్లడించారు. నవంబర్​ 30న ఈ కిడ్నాప్​ జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

former Ranji player, Ex-cricketer Robin Morris arrested for `kidnapping' loan agent
కిడ్నాప్​ కేసులో ముంబయి మాజీ క్రికెటర్​ అరెస్ట్​

By

Published : Dec 6, 2019, 12:43 PM IST

ముంబయికి చెందిన మాజీ రంజీ క్రికెటర్ రాబిన్ మోరిస్​ మరోసారి వార్తల్లో నిలిచాడు. లోన్ ఏజెంట్‌ని కిడ్నాప్ చేసిన కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని కుర్లా ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి ఓ వ్యక్తిని అపహరించాడట మోరిస్​. క్రికెటర్​కు ఇవ్వాల్సిన కొంత మొత్తాన్ని చెల్లించకపోవడం వల్లే ఈ కిడ్నాప్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఇదీ జరిగింది...

కొన్నాళ్ల క్రితం బ్యాంక్​ నుంచి 7 కోట్ల అప్పు​ ఇప్పిస్తానని మోరిస్​ను... ఓ లోన్​ ఏజెంట్​ కలిశాడు. ఇందుకోసం 7 లక్షలు కమీషన్​ తీసుకున్నాడు. అయితే ఆ లోన్​ ఇప్పించడంలో విఫలమైన ఆ ఏజెంట్​... తీసుకున్న మొత్తం నుంచి ఐదున్నర లక్షలు మాత్రమే తిరిగి చెల్లించాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్​ చేసినా మిగతా డబ్బు ఇవ్వక పోవడం వల్ల... అతడిని తన స్నేహితుల సహాయంతో అపహరించాడు మోరిస్​. నవంబర్​ 30న ఆ ఏజెంట్​ను ఓ ప్రాంతానికి రమ్మని చెప్పి... అక్కడ నుంచి ఎత్తుకెళ్లి రహస్యంగా ఓ గదిలో బంధించారు. ఆ తర్వాత బాధితుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. డబ్బులు తీసుకురమ్మని డిమాండ్ చేసింది మోరిస్​ బృందం. ఈ ఘటనపై ఏజెంట్​ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించినట్లు సీనియర్​ పోలీస్ ​అధికారి దత్తాత్రేయ శిండే తెలిపారు.

కిడ్నాప్, దుర్భాషలాడటం, దోపిడి, మనుషులను గాయపరచాలనుకోవటం, బెదిరించడం లాంటి కేసుల కింద మోరిస్​ బృందాన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. గతేడాది మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ.. ఈ క్రికెటర్ కెమెరా కంటికి చిక్కి వార్తల్లో నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details