గువాహటిలో జరగాల్సినభారత్-శ్రీలంక తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. వరుణుడు కరుణించినా నిర్వహణ లోపంతో ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దవడం వల్ల అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే పిచ్‌ను ఆరబెట్టేందుకు మైదాన సిబ్బంది చేసిన ప్రయత్నాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఈ మ్యాచ్ లో వర్షం పడి ఆగిపోయాక పిచ్ ను ఆరబెట్టడానికి సిబ్బంది ఇస్త్రీ పెట్టె, హెయిర్ డ్రయర్లను ఉపయోగించారు. ఈ విషయమై కామెంటేటర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అభివృద్ధి చెందిన కాలంలోనూ ఇలాంటి పద్ధతులేంటంటూ అసోం క్రికెట్ సంఘాన్ని విమర్శించారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.